డ్రైవర్ ను చితక్కొట్టి బొలెరో వాహనాన్ని ఎత్తుకెళ్లారు!
ఒడిశా సరిహద్దుల్లో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి మండలంలోని బొర్రాకు చెందిన ట్రావెల్స్ వాహనం బొలెరోను ఒడిశా వెళ్లేందుకు ఇద్దరు వ్యక్తులు బాడుగకు మాట్లాడుకున్నారు. వాహనం గమ్యం వైపు సాగిపోతుండగా, అరకు వ్యాలీ సమీపంలో మరో ఇద్దరు వ్యక్తులు ఒడిశా వెళ్లాలంటూ వాహనం ఆపి ఎక్కారు. అనంతరం ఒడిశా సరిహద్దుల్లోకి రాగానే నలుగురూ డ్రైవర్ పై దాడికి దిగి కొట్టారు. తరువాత డ్రైవర్ ను బెదిరించి, అక్కడే అతనిని దించేసి వాహనంతో పరారయ్యారు. దీంతో డ్రైవర్ ఫోన్ చేసి విషయం యజమానికి వివరించగా, పోలీసులకు ఫిర్యాదు చేశారు.